YS Jagan: మత దాడులను అరికట్టడంలో విఫలం: ఆదిరెడ్డి శ్రీనివాస్
మతాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలుగుదేశం పార్టీ (TDP) నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ (Adireddy Srinivas). టీడీపీ హయాంలో ఓ మసీదులో జరిగిన మౌజన్ హత్య కేసును కేవలం రెండు రోజుల్లో చేధించిందని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మతాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు తెలుగుదేశం పార్టీ (TDP) నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ (Adireddy Srinivas). టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఓ మసీదులో జరిగిన మౌజన్ హత్య కేసును కేవలం రెండు రోజుల్లో చేధించింది. అనాడు మత విధ్వేషాలు రెచ్చగొట్టాలని యత్నించిన వారు నేడు అంతర్వేది విషయంలో ఎందుకు చేధించలేకపోతోందని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. Anantapur Road Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం
టీడీపీ హయాంలో మూడేళ్ల కిందట జరిగిన మౌజన్ హత్య కేసును అత్యాధునిక సాంకేతికను వినియోగించి రెండు రోజుల్లో ఛేదిస్తే.. ప్రస్తుత ప్రభుత్వ వైఎస్సార్‌సీపీ మత దాడులపై ఎందుకింత ఉదాసీనత ప్రదర్శిస్తున్నారని సూటిగా అడిగారు. చంద్రబాబు నాయుడు హయాంలో అన్ని మతాలను ఒకే తీరుగా చూశారని, మతాల మధ్య వివాదాలు రాకుండా ఎన్నో చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన ఆధునిక టెక్నాలజీని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించరు, కనీసం సమస్యను ఏదో తీరుగా పరిష్కరిస్తారా అంటే.. దానికి బదులుగా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. Bigg Boss Telugu 4: రెండో వారం నామినేషన్‌లో గంగవ్వ సహా 9 మంది సభ్యులు
వైఎస్సార్‌సీపీ నేతలు, ఏపీ మంత్రులు తమ ఇష్టతీరుగా వ్యవహరించినా ఏ చర్యలు లేవన్నారు. టీడీపీ నేతలు కొందరు కనిపిస్తే చాలు కోవిడ్19 నిబంధనలను కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే రాజధాని పేరుతో రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య వివాదాన్ని రాజేసిన వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం మతాల మధ్య చిచ్చుపెట్టడానికి యత్నిస్తోందని ఆరోపించారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. LockDown: సెప్టెంబర్ 25 నుంచి మరో లాక్‌డౌన్.. స్పందించిన కేంద్రం
ఫొటో గ్యాలరీలు
- Shivani Narayanan Photos: ట్రెడీషన్, మోడ్రన్ ఏదైనా సరే..
- Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు
- బిగ్‌బాస్ ఫైనలిస్ట్ Rashami Desai Hot Photos వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR